- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏం పీక్కుంటావో పీక్కో.. ఈడీపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఈడీపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఈడీకి దొంగలు భయపడతారని, తాను భయపడనని అన్నారు. నిజాయితీగా ఉండే తామెందుకు భయపడతామని, ఈడీ వాళ్లు వస్తే తనకు చాయ్ తాగించి పోతారని కేసీఆర్ సెటైర్లు వేశారు. మీరు గోకినా, గోకకపోయినా తాను గోకుతానంటూ మోదీపై మండిపడ్డారు. ఈడీ, బోడీలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో అని కేసీఆర్ సవాల్ చేశారు. బీజేపీ వాళ్లకు ఎందుకింత అహంకారమని, తమిళనాడులో, పశ్చిమబెంగాల్ లో ప్రభుత్వాలను పడగొడతామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు మోటార్లకు మీటర్లు పెట్టేదే లేదన్నారు. దయచేసి ప్రలోభాలకు గురికావద్దని, అందరం కలిసి బీజేపీకి మీటర్ పెడదామని కేసీఆర్ చెప్పారు. మోదీని ఆయన అహంకారమే పడగొడుతుందని తెలిపారు. చండూరులో మరో సభ పెట్టుకుందామన్నారు. కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదని, మీటర్లు పెట్టనివ్వనని కేసీఆర్ పేర్కొన్నారు. ఎవరు యుద్దం చేస్తారో వాళ్ల చేతిలోనే కత్తి పెట్టాలని, మాటలు విని మోసపోతే గోసపడతామన్నారు.
ఇవి కూడా చదవండి : కేసీఆర్ మునుగోడు సభలో ఊహించని పరిణామం