వేముల మంజులమ్మ అంత్యక్రియలకు హాజరైన CM KCR

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-13 07:29:54.0  )
వేముల మంజులమ్మ అంత్యక్రియలకు హాజరైన CM KCR
X

దిశ, ఆర్మూర్ : దివంగత రైతు నాయకుడు, వేముల సురేందర్ రెడ్డి సతీమణి, రాష్ట్ర రోడ్లు భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి గురువారం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం వేముల మంజులమ్మ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. హెలిక్యాప్టర్‌లో వేల్పూర్ వచ్చిన సీఎం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. వేముల తల్లి మంజులమ్మ పార్థివ దేహం పై సీఎం కేసీఆర్ పుష్పగుచ్చం నుంచి నివాళులర్పించారు.

అనంతరం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన సోదరుడు వేముల అజయ్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ధైర్యంగా ఉండాలని వారికి మనో ధైర్యాన్ని ఇచ్చారు. రాష్ట్ర మంత్రి వేముల మాతృమూర్తి అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ,సీఎం తనయ, ఇందూరు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్యేలు ఆశన్న గారి జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా ,షకీల్ హైమద్, బాజి రెడ్డి గోవర్ధన్, ఇందూరు డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చైర్మన్ డాక్టర్ బద్దం మధుశేఖర్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, వేముల బంధువులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వేముల మంజులమ్మకు నివాళులర్పించిన బిజెపి నాయకులు...

రాష్ట్ర రోడ్లు భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ గురువారం అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో శుక్రవారం వేల్పూర్‌లోని వారి నివాసంలో గల మంజులమ్మ భౌతిక దేహానికి బిజెపి నాయకులు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వేముల మంజులమ్మకు నివాళులర్పించిన వారిలో జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డే మోహన్ రెడ్డి, ఏలేటి మల్లికార్జున్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed