- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం ఫోకస్.. నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రేవంత్ సమీక్ష
దిశ, డైనమిక్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలు పూర్తి కావడంతో పరిపాలన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, నకిలీ విత్తనాల అమ్మకాలపై సీఎం రివ్యూ చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ రివ్యూలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ కొత్తకోట ప్రభాకర్‌రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో వ్యవసాయ పనులు జోరందుకుంటున్నాయి. దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం సమీక్ష జరిపినట్టు తెలుస్తోంది.
సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వారంతా గత ప్రభుత్వం పెద్దల ఆదేశాల మేరకే పని చేశామని పోలీసుల విచారణలో స్టేట్‌మెంట్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా తాను ఈ అంశంపై ఎలాంటి రివ్యూ నిర్వహించలేదని గతంలో రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే కోడ్ పూర్తవడంతో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు మరికొన్ని అంశాలపై అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు.