రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి ‘సీఎం కప్’?

by Mahesh |   ( Updated:2024-08-25 15:17:28.0  )
రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి ‘సీఎం కప్’?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సహజంగా ఫుట్ బాల్ ప్లేయర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహించాలి పై ఫోకస్ పెట్టారు. ఇప్పటి నుంచి ఏటా సీఎం కప్ పేరుతో ఆటలపోటీలను నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకు ఈ ఏడాది అక్టోబరు 2న శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పక్షం రోజుల పాటు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించే యోచనలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో విజేతలైన క్రీడాకారులను ఒలంపిక్స్ కు పంపించేందుకు శిక్షణ బాధ్యతలను తీసుకోనుంది. దీనికి సంబంధించి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి అధికారిక ప్రకటన చేస్తారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీలో ట్రైనింగ్

స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీగా పేరు పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే.. సీఎం కప్‌లో విజేతలైన క్రీడాకారులకు యంగ్ఇండియా వర్సిటీలో ఆడ్మిషన్లు ఇచ్చి, ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అందుకు కావాల్సిన ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. ప్రపంచ దేశాల్లోని స్పోర్ట్స్ వర్సిటీలకు దీటుగా స్టేట్ స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారు. అందుకు దక్షిణ కొరియాలోని స్పోర్ట్స్ వర్సిటీని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

ఫోర్త్ సిటీ దగ్గరలోనే వర్సిటీ

ఫ్యూచర్ సిటీ సమీపంలోనే స్పోర్ట్స్ వర్సిటీని నెలకొల్పాలని సీఎం ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆ ప్రాంతంలో అభివృద్ధితో పాటు, అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర ఉండటం వల్ల రవాణా సౌకర్యం ఈజీగా ఉండనుంది. భవిష్యత్‌లో ఒలింపిక్స్ నిర్వహించే విధంగా వర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాలు, కాంప్లెక్స్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed