CM Chandrababu: శిక్షలు కఠినంగా ఉంటేనే.. భయం, భక్తి ఉంటాయ్.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
CM Chandrababu: శిక్షలు కఠినంగా ఉంటేనే.. భయం, భక్తి ఉంటాయ్.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: శిక్షలు కఠినంగా ఉంటేనే నేరాలు చేయాలనుకునే వారిలో భయం, భక్తి ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024‌ (Land Grabbing Act-2024)పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇసుక, బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పీడీ యాక్ట్ (PD Act)కు కూడా పదును పెడుతున్నామని తెలిపారు. లా అండ్ ఆర్డర్ (Law and Order) సరిగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని అన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ (Hyderabad) నగరంలో మతపరమైన గొడవలు ఉండేవని, రాయలసీమ (Rayalaseema)లో ఫ్యాక్షన్, విజయవాడ (Vijayawada)లో రౌడీలు ఉండేవారని వారందరినీ ఉక్కుపాదంలో అణచివేశామని అన్నారు.

గంజాయి (Ganja) సహా అనేక సమస్యలు నేడు వారసత్వంగా వచ్చాయని, దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా వాటి మూలాలు విశాఖలో ఉండేవని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే గంజాయి భయానకంగా తయారైందని పేర్కొన్నారు. ప్రతి నేరం వెనుక గంజాయి బ్యాచ్ ఉంటుందని తెలిపారు. ఇక నుంచి ఇసుక (Sand), బియ్యం (Rice) అక్రమ రవాణా చేసినా పీడీ యాక్ట్ (PD Act) పెడతామని స్పష్టం చేశారు. నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ చిరునామాగా మారాలంటే లా అండ్ ఆర్డర్ (Law and Order) ముఖ్యమని తెలిపారు. తప్పు చేసిన వాళ్లను ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను ఇప్పటికే సస్పెండ్ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు.

Advertisement

Next Story