- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం పోస్ట్ పై భట్టి క్లారిటీ!
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పోస్ట్ ఎవరికి అనే దానిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. ఇటీవల జరిగిన మంచిర్యాల సభ నుండి ముఖ్యమంత్రి పదవి రేస్ లో భట్టి విక్రమార్క పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడినే ముఖ్యమంత్రి చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. అప్పటి నుంచి ఈ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో రకరకాల వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఈ అంశంపై బుధవారం భట్టి విక్రమార్క స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎవరు అనేది అధిష్టానమే చూసుకుంటుందని చెప్పారు.
ఎన్నికలకు ముందే సీఎం క్యాండిడేట్ ను అనౌన్స్ చేసే సంప్రదాయం కాంగ్రెస్ లో లేదని, ఫలితాల అనంతరం సీఎల్పీలో మాట్లాడి నిర్ణయిస్తారని చెప్పారు. పార్టీలో గ్రూప్ విభేదాలు బయటపడుతున్నాయన్న విమర్శలపై స్పందించిన ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, అందువల్ల పార్టీలో పోటీ తత్వం పెరిగిందన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సీఎల్పీ నేతకు గ్యాప్ ఉందని జరుగుతున్న ప్రచారం అంతా గిట్టని వాళ్ల పని అని కొట్టిపారేశారు. ఇలాంటి ప్రచారం చేసేవాళ్లు బీజేపీకి సంబంధించిన వారై ఉండాలి లేదా బీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతూ ఆ పార్టీకి అమ్ముడుపోయే వాళ్లు అయి ఉంటారని అన్నారు.