- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒవైసీ, మల్లారెడ్డి కాలేజీల కూల్చివేతలపై క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(Hydraa)పై కేటీఆర్(KTR) కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ, చేయిస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా మీద తప్పుడు ప్రచారం చేయించేందుకే కేటీఆర్ కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు ఇచ్చారని కీలక ఆరోపణలు చేశారు. ఒవైసీ(Owaisi), మల్లారెడ్డి(Mallareddy), మర్రి రాజశేఖర్ రెడ్డి(Marri Rajasekhar Reddy)ల విద్యాసంస్థలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమయం ఇచ్చారని తెలిపారు. కేవలం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొనే సమయం ఇచ్చారని అన్నారు. అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక కూల్చివేతలు ఉంటాయని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు కూల్చివేతలు ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చి పది నెలలే అయిందని తెలిపారు. ఎంఐఎంకు ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఔరంగాబాద్‌లో ఎంఐఎం నేతకు రెడ్ కార్పెట్ పరిచారని అన్నారు.