- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Miyapur : వీడిన మియాపూర్ మైనర్ బాలిక హత్య కేసు మిస్టరీ
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరం మియాపూర్(Miyapur) కు చెందిన మైనర్ బాలిక(17) హత్య కేసు మిస్టరీ(Mystery)ని ఎట్టకేలకు పోలీసులు చేదించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్ అనే యువకుడు ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు తమ విచారణలో తేల్చారు. ఈ మేరకు సీఐ క్రాంతికుమార్ కేసు వివరాలను వెల్లడించారు. మియాపూర్ టేక్ అంజయ్య నగర్‌కి చెందిన మైనర్ బాలిక 20రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన విఘ్నేష్ తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వారిద్ధరు కంచన్‌బాగ్‌లో ఓ ఇంట్లో సహజీవనం సాగిస్తున్నారు. అయితే బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో మరో యువకుడితో మాట్లాడుతుంటే చూసిన విఘ్నేష్ కోపంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకుని, తనకు తెలిసిన సాకేత్, కల్యాణి దంపతుల సహకారం కోరాడు. వారి సూచన మేరకు బాలికు పెళ్లి చేసుకుని హత్య చేస్తే ఎవరికి అనుమానం రాదని పథకం వేశారు.
ఈ నెల 8న విఘ్నేశ్, బాలిక పెళ్లి చేసుకున్నారు. తాను విఘ్నేశ్‌ను పెళ్లి చేసుకున్నానని, వారంలో ఇంటికి వస్తానని ఆ బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. సాకేత్ దంపతులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తర్వాత విఘ్నేశ్ బాలిక తలను గోడకేసి కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన సాకేత్, కల్యాణి సహకారంతో బాలిక మృతదేహాన్ని తుక్కుగూడలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. మరుసటి రోజు 9న బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసిన విఘ్నేశ్.. మీ బిడ్డ ఇంటికి వచ్చిందా అని అడిగాడు. అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులకు 10న ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విఘ్నేశ్‌ను విచారించగా నేరం అంగీకరించారు. ఓఆర్‌ఆర్ సమీపంలో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విఘ్నేశ్‌తో పాటు సాకేత్, కల్యాణిని పోలీసులు అరెస్ట్ చేశారు.