- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘‘రైతులతో రాజకీయాలొద్దు’’.. ప్రతిపక్షాలకు సివిల్ సప్లై చైర్మన్ రవీందర్ సింగ్ వార్నింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతిపక్షాలు రైతులతో రాజకీయాలు చేయవద్దని పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ విమర్శించారు. రైతుల పక్షాన నిలబడి రైతులకు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి మేము 10 వేలు ఇచ్చాము.. అలానే మీరు కూడా ఇప్పించండి కానీ అనవసరంగా ఆరోపణలు చేయకండన్నారు. రైతు బిడ్డగా సీఎం కేసీఆర్‌కు అన్ని తెలుసని, ఇతరులు చెప్పాల్సింది ఏం లేదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత మాదేనని, ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కూడా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. కేంద్రానికి ఎంత ధాన్యం వచ్చిన ధాన్యం పూర్తి అయ్యే వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఏప్రిల్ 15న కొనుగోలు స్టార్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారు చెప్పిన దానికంటే ముందే స్టార్ట్ చేశారని పేర్కొన్నారు.
7,152 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటివరకు 6000 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. గత సీజన్లో 4 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. కానీ ఈ సంవత్సరం నేటి వరకు 10 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఇది గత సంవత్సరం కంటే డబుల్ ఇప్పటివరకు కొనుగోలు చేశామని తెలిపారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని, వెంటనే సీఎం కేసీఆర్ స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ప్రకటించారని గుర్తుచేశారు. అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభం అయ్యిందని, వరి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే అంటే వారం రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని వెల్లడించారు.