- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్‌కి ఆ సత్తా ఉందా.. డిఫాల్ట్ రైస్ మిల్లర్ల సమీక్షలో చైర్మన్ విమర్శలు
దిశ, తెలంగాణ బ్యూరో: రైస్ మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణలో మరింత కఠినంగా వ్యవహరించాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అదే స్థాయిలో సీఎంఆర్ సేకరణలో కూడా ప్రదర్శించాలని సూచించారు. బుధవారం పౌరసరఫరాల భవన్‌లో సంస్థ మేనెజింగ్ డైరెక్టర్ అనిల్‌కుమార్‌తో కలసి 2019- 20 లో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎంఆర్ అధికంగా పెండింగ్‌లో ఉన్న జిల్లాల డీఎస్‌ఓలు, డీఎంలు డిఫాల్ట్ రైస్ మిల్లర్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. సీఎంఆర్‌లో జాప్యం జరగడం వల్ల సంస్థపై వడ్డీ భారం పెరుగుతోందన్నారు. సీఎంఆర్ అప్పగించడంలో మీకున్న సమస్యలేంటి, 90% మిల్లర్లుకు లేని ఇబ్బంది మీకే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఒక తెలంగాణ రాష్ట్రం మినహా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్రంలో పండిన పంటలో పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదన్నారు. 2019-20లో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లు 15 రోజులులోగా బకాయి పడిన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆయా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ రాజారెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.
తడిసిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేస్తదా బండి సంజయ్?
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని సర్దార్ రవీందర్‌సింగ్ ఒక ప్రకటనలో విమర్శలు చేశారు. ఆలస్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవడం వల్లనే దాన్యం తడిచిపోయిందని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించినా కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి 13వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇప్పటివరకు 3000 కేంద్రాలను ప్రారంభించి 3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.
గత ఏడాది ఇదే సమయానికి 93 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా బండి సంజయ్ మాటలు ఉన్నాయని, ఆయన మాటలను రైతులు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు అభయం ఇవ్వడం జరిగిందన్నారు. ప్రచారం కోసం వాస్తవాలను వక్రీకరించి మాట్లాడ డం ఆయనకే చెల్లుబాటు అవుతుందన్నారు. బండి సంజయ్ కి చేతనైతే రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు కేంద్రం నుంచి కమిటీని రప్పించాలని అలాగే ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చూడాలని ఈ సత్తా బండి సంజయ్ కి ఉందా అని ప్రశ్నించారు.