- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండా సురేఖ VS కేటీఆర్.. మీడియా, సోషల్ మీడియా సంస్థలకు కోర్టు నోటీసులు
దిశ, వెబ్ డెస్క్: తనపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యల కారణంగా పరువుకు భంగం కలిగిందని పేర్కొంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వేసిన రూ.100 కోట్ల పరువునష్టం దావా కేసుపై సిటీ సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి.. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్న కోర్టు.. ఆ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది. భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని కొండా సురేఖకు సూచించింది.
అలాగే.. కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని ప్రసారం చేసిన, రాసిన మీడియా వెంటనే ఆ కథనాలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. అలాగే అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఆ వీడియోలను తొలగించాలని పేర్కొంది. యూ ట్యూబ్ (Youtube), ఫేస్ బుక్ (Face Book), గూగుల్ (Google) సంస్థలకు సైతం ఈ మేరకు సిటీ సివిల్ కోర్టు (City Civil Court) నోటీసులు జారీ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడిన కోర్టు.. ఎలాంటి పబ్లిక్ డొమైన్ లోనూ సంబంధిత వ్యాఖ్యలు ఉండరాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.