ఎన్టీఆర్ జయంతి.. కేంద్ర ప్రభుత్వానికి చిరంజీవి కీలక రిక్వెస్ట్

by Rajesh |   ( Updated:2024-05-28 11:54:22.0  )
ఎన్టీఆర్ జయంతి.. కేంద్ర ప్రభుత్వానికి చిరంజీవి కీలక రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఎన్టీఆర్ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇక, ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కేంద్రప్రభుత్వానికి కీలక రిక్వెస్ట్ చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన చిరు.. కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శమన్నారు.

నందమూరి తారకరామారావు గారిని ఈ రోజు గుర్తు చేసుకుంటూ, వారు ప్రజాజీవితంలో చేసిన సేవలకు భారత రత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ ట్వీట్‌కు ఎన్టీఆర్ తో తాను దిగిన ఫొటోను చిరంజీవి జత చేశారు. ఈ ఫొటో చిరంజీవి భుజంపై ఎన్టీఆర్ చేయి వేసి హుందాగా నడుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed