- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ ఎదుగుదలపై చైనా, పాకిస్థాన్ కుట్ర : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : భారతదేశ ఎదుగుదలపై చైనా, పాకిస్తాన్ కుట్రలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. గతంలో ఎక్కడా కనిపించని దేశం.. ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో ఉండటంతో పాక్, చైనా సహించలేకపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన బాగ్ అంబర్‌పేట డివిజన్‌లో బస్తీ పర్యటన చేశారు. అనంతరం సీఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియాతో చైనా వెనుకబడిపోయిందని, ఆ కారణంగా చైనా దేశం భారత్‌పై పాకిస్తాన్‌తో కలిసి కక్షగట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఓడించాలని కుట్రలు చేస్తోందని తెలిపారు. దేశ గౌరవం పెరగాలంటే.. మోడీ మళ్లీ గెలవాలని ఆయన ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు ప్రధానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, వాటిని తిప్పి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.