- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఇక నేనే రంగంలోకి దిగుతా’.. గోవధపై చికోటి ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: బక్రీద్ సందర్భంగా ఎన్నోచోట్ల గోవులను అక్రమంగా వధించేందుకు తరలిస్తున్నారని, మెదక్‌లో గోవధకు తీసుకెళ్తున్న గోవులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే హత్య చేసేందుకు ప్రయత్నించారని, కత్తితో గాయాలు చేశారని బీజేపీ నేత చికోటి ప్రవీణ్ ఆదివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్నారని, గోవధ చేస్తున్న వారిని అడ్డుకునేందుకు హిందువులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే హత్యకు కూడా వెనుకాడటం లేదంటే దీని వెనుక ఎంత నెట్ వర్క్ ఉందనేది రాష్ట్ర ప్రభుత్వం బయటకు లాగాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనల్లో తన అవసరం ఉందనుకుంటే తానే నేరుగా రంగంలోకి దిగుతానని, ఎక్కడికైనా వస్తానని చికోటి ప్రవీణ్ కుమార్ స్పష్టంచేశారు. గోవధ హిందూ సాంప్రదాయానికి విరుద్ధమని ఆయన వివరించారు. అయినా ఇతర పార్టీలు దీనికి సపోర్ట్ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తున్నారని, గోవధకు ప్రయత్నిస్తే హిందువులు ఉద్యమానికి దిగుతారని చికోటి హెచ్చరించారు. అదే జరిగితే ఏ డిపార్ట్ మెంట్ కూడా వారిని తట్టుకోలేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గోవధ తగ్గుతుందనుకున్నానని, కానీ గత ప్రభుత్వ దారిలోనే నడుస్తోందని విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గోవధను అరికట్టాలని చికోటి డిమాండ్ చేశారు.