- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chikoti Praveen: మరో వివాదంలో చికోటి ప్రవీణ్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : క్యాసినో వ్యవహారంలో సంచలనం సృష్టించిన చికోటి ప్రవీన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీతో హల్ చల్ చేసిన చీకోటి ప్రవీణ్ ఉదంతంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అదుపులోకి తీసుకున్న ముగ్గురు బాడీ గార్డులలో ఒకరి వద్ద ఫోర్జరీ లైసెన్స్ ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. బోనాల పండుగను పురస్కరించుకొని చీకోటి ప్రవీణ్ ఆదివారం సింహావాహిని అమ్మవారి గుడికి వచ్చిన విషయం తెలిసిందే.
కాగా, వెంట ప్రైవేట్ సెక్యూరిటీ తెచ్చుకున్న చీకోటి ప్రవీణ్ వారితో కలిసి బారికేడ్ల వరకు వెళ్లాడు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను తనిఖీ చెయ్యగా వారి వద్ద ఆయుధాలు దొరికాయి. దాంతో బందోబస్తు డ్యూటీలో ఉన్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఛత్రినాకా పోలీసులకు అప్పగించారు. ఛత్రినాకా పోలీసులు జరిపిన విచారణలో ఒక సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న లైసెన్స్ ఫోర్జరీదని తేలింది. దాంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.