- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోల్డ్ బంగ్లా వద్ద చిరుత సంచారం...
దిశ, మహబూబ్ నగర్: కేసీఆర్ ఏకో పార్క్-ఫతేపూర్ మధ్య అటవీ ప్రాంతం దొడ్డలోనిపల్లి ప్రాంతంలో ఉన్న గోల్డ్ బంగ్లా వద్ద శనివారం సాయంత్రం చిరుత పులి సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. కేసీఆర్ ఏకో పార్క్ నుంచి - ఫతేపూర్ వరకు 13.5 కిలోమీటర్ల పొడవున ఉన్న ట్రాక్ లో భాగంగా గతంలో ఉన్న గోల్డ్ బంగ్లాను ఆధునీకరించి అటవీ అందాలను చూసే ఏర్పాటు చేశారు. అడవిలో ఏ జంతువులు, ఇతర జీవరాసులు ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు అక్కడక్కడ సోలార్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గోల్డ్ బంగ్లా వద్ద శనివారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లుగా కెమెరాలో రికార్డు అయ్యింది.
అడవిలో దారి ఉన్నప్పటికీ సందర్శకులు ఎవరు కూడా కాలినడకన వెళ్లకూడదు అని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎం రాజశేఖర్ తెలిపారు. అక్కడక్కడ ఏర్పాటు చేసిన కెమెరాలలో చిరుతలతో పాటు, పలు రకాల ఇతర జంతువులు , విష సర్పాలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు. కేవలం సఫారీ వాహనంలో వెళ్లి సురక్షితంగా అటవీ అందాలను ఆస్వాదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ కాలినడకన వెళ్లి ఇబ్బందుల పాలు కావద్దు అని సూచించారు.