- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యూహం మార్చిన తెలంగాణ బీజేపీ.. మంత్రి కేటీఆర్‌పై స్పెషల్ ఫోకస్!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయంలో పేపర్ లీక్ మంటలు రాజుకుంటున్నాయి. ఈ కేసులో రోజుకో అంశం తెరపైకి రావడం సంచలనంగా మారుతోంది. హిందీ ప్రశ్నపత్రం పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం, కోర్టు బెయిల్ మంజూరుతో బయటకు రావడం జరిగింది. అయితే ఈ వ్యవహారం బీఆర్ఎస్, బీజేపీ మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. ఈసారి వ్యూహం మార్చిన కమలనాథులు మంత్రి కేటీఆర్‌పై ఫోకస్ పెట్టారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే టెన్త్ లీకేజ్ కేసుకు బీజేపీకి ముడిపెడుతున్నారని కమలనాథులు ఆరోపిస్తున్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన బండి సంజయ్ కేటీఆర్ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేయడం ఆ వెంటనే కేంద్ర పెద్దలు బండి సంజయ్‌కు తోడుగా ఉన్నామని ప్రభుత్వంపై పోరాటం మరింత ఉధృతం చేయాలని సూచించంతో బీఆర్ఎస్ కష్టాలు తప్పవా అనే టాక్ వినిపిస్తోంది. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, మెడలు పట్టి బయటకు పంపాలని బండి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి బాధ్యత వహించి యువతకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కుటుంబమే లిక్కర్, లీకర్ కుటుంబంగా మారిపోయిందని చేసిందంతా చేసి లీకుల వ్యవహారాన్ని విద్యాశాఖ మంత్రిపై తోయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే బండి సంజయ్ జైలు నుంచి వచ్చాక కేటీఆర్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించడం వెనకు బీజేపీ కేటీఆర్ ను కార్నర్ చేయబోతోందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం అని చెప్పే బండి సంజయ్ తాజాగా కేటీఆర్ అరెస్ట్ అవ్వడం పక్కా అని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఇక బండి వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ పై విచారమ జరుగుతుందని బండి సంజయ్ ఎలా చెబుతారని ఆయనేమైనా ఈడీనా, సీబీఐనా అని ప్రశ్నిస్తున్నారు. లీకేజీ పాపం అంతా బీజేపీదే అని కౌంటర్ ఇస్తున్నారు. ఏకంగా పేపర్ లీకేజీలో బీజేపీ పెద్దలు ఉన్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.పేపర్ లీకేజీలో కేంద్రంలోని పెద్దల హస్తం ఉందని తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంటి వారు చేసిన వ్యాఖ్యానించడం సెన్సేషన్ అవుతోంది. దీంతో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ ఢీ అంటే ఢీ అనేలా మారింది. ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం ఎటువైపు వెళ్తుందో చూడాలి మరి.