- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ రాష్ట్రంలో చంద్రబాబు సెంటిమెంట్.. CBNకు మద్దతుగా..
దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకు ఆసక్తి రేపుతోంది. చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించేందుకు తొలుత వెనుకడుగు వేసిన బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు క్రమక్రమంగా తమ నోరు విప్పుతున్నారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబుకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో సంతకాల సేకరణ చేపట్టడం ఆసక్తిగా మారింది. చంద్రబాబు అభిమాన సంఘం నేత తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం సంతకాల సేకరణ ప్రారంభించారు. సంతకాల సేకరణలో గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండ్ల రవి, ఎమ్మార్పీఎస్ నాయకులు గోవింద్ నరేష్‌లు పాల్గొని మద్దతు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ దశల వారీగా సంతకాల సేకరణ చేపడతామని తలారి శ్రీనివాస రావు తెలిపారు. కాగా ఇటీవల ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో టీటీడీపీ నేతలతో ఆ పార్టీ పొలిట్ బ్యూరో నాయకుడు నందమూరి బాలకృష్ణ సమావేశం అయి తెలంగాణలో ఓట్ల కోసమే కొంత మంది ఎన్టీఆర్ జంపం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ నేతకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చిన బాలయ్య వరుసుగా రెండు రోజులు టీటీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమానికి అడ్డగా నిలిచిన ఉస్మానియాలో వేదిక నుంచి చంద్రబాబుకు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలు కావడం ఆసక్తిగా మారింది.