ఎన్నికల వేళ సంచలన ఘటన.. చంద్రబాబు CM కావాలని నాలుక కోసుకున్న వీరాభిమాని..!

by Satheesh |   ( Updated:2024-05-12 14:50:09.0  )
ఎన్నికల వేళ సంచలన ఘటన.. చంద్రబాబు CM కావాలని నాలుక కోసుకున్న వీరాభిమాని..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ నెలకొంది. మరికొన్ని గంటల్లో ప్రారంభకానున్న పోలింగ్‌కు అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి రెండు తెలుగు స్టేట్స్‌లో పోలింగ్ మొదలు కానుంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమాని చేసిన పని ఎన్నికల వేళ రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 14 సంవత్సరాల పాటు సీఎం పదవి నిర్వహించిన చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఏకంగా నాలుక కోసుకున్నాడు బాబు వీరాభిమాని. అయితే, ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా తెలంగాణలో చోటు చేసుకోవడం గమనార్హం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

చంద్రబాబు డైహార్డ్ ఫ్యాన్ ఒకరు టీడీపీ చీఫ్ మరోసారి ఏపీ సీఎం కావాలని నాలుక కోసుకోవడంతో వెంటనే గమనించిన చుట్టు పక్కల వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స్ పొందుతోన్న బాబు అభిమాని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే, అతడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ జత కట్టి ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. మరీ ఏపీలో ఎన్డీఏ కూటమి గెలిచి చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆయన అభిమాని కోరి నెరవేరుతోందో లేదో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

Read More..

AP:ఫేక్ ఆడియో పై చంద్రబాబు స్పందన ఇదే..!!

Advertisement

Next Story