నేడు ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జ్

by Javid Pasha |   ( Updated:2023-11-03 06:05:59.0  )
నేడు ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జ్
X

దిశ, వెబ్‌డెస్క్: అనారోగ్య కారణాల వల్ల చికిత్స కోసం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు చేరారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చికిత్స అందించారు. ఇవాళ చంద్రబాబును ఏఐజీ వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లనున్నారు.

చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉంది. దీంతో ఎల్వీ ప్రసాద్ వైద్యులు కంటికి వైద్య పరీక్షలు చేయనున్నారు. త్వరలో కంటి ఆపరేషన్ చేసే అవకాశముంది. కంటి ఆపరేషన్ చేసిన తర్వాత కొద్ది రోజులు ఇంటికే చంద్రబాబు పరిమితం కావాల్సి ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

Next Story