కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీలకు ఛాన్స్

by GSrikanth |
కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీలకు ఛాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సమగ్ర శిక్ష కింద మండల విద్యా వనరుల కేంద్రాల్లో పనిచేస్తున్న తాత్కాలిక కాంట్రాక్టు ఉద్యోగులకు బదిలీలకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, రాష్ట్ర పథక సంచాలకులు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సమగ్ర శిక్షా కింద మండల విద్యావనరుల కేంద్రాల్లో తాత్కాలికంగా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఐఈఆర్పీలు, జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో తాత్కాలికంగా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సిస్టమ్ ఎనలైసిస్ట్స్, అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్స్ ప్రస్తుత స్థానం నుండి ఇతర స్థానమునకు మార్పును కోరు వారు తమ అభ్యర్థనలను ఐఎస్ఎంఎస్ పోర్టల్ నందు schooledu.telangana.gov.in అన్‌లైన్ లో మే 23 నుంచి 25 వరకు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా అన్ లైన్ ద్వారా నిర్వహించాలని సూచించారు. వివరాలు, సూచనలు, మార్గదర్శకాలు వెబ్‌సైట్‌లో పొందుపరచినట్లు తెలిపారు.

Advertisement

Next Story