Chamala Kiran Kumar Reddy : కేటీఆర్ ట్వీట్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ ఫైర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-31 12:43:30.0  )
Chamala Kiran Kumar Reddy : కేటీఆర్ ట్వీట్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : త్రీడీ(3D) పేరుతో 3D కాంగ్రెస్ పాలన(Congress Rule)పై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) ఫైర్ అయ్యారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. 2024సంవత్సరం నా జీవితంలో మరిచిపోలేనిదన్నారు. 20ఏళ్ల నా రాజకీయ జీవిత పోరాటాలను గుర్తించి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంపీగా ఎన్నుకుని నాపై చూపిన ప్రేమ విస్మరించలేదన్నారు. 2024 ఏడాది కాంగ్రెస్ పాలన మోసపూరితమన్న కేటీఆర్ త్రీడీ విమర్శలు వాస్తవానికి పదేళ్ల బీఆర్ఎస్ పాలనకే వర్తిస్తాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పదేళ్ల పాలనతో మోసం జరిగిందని, దళిత సీఎం, 2లక్షలు ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాల్లో మోసం జరిగిందని, చీకటి జీవోలతో మోసం జరిగిందన్నారు. ఇక విధ్వంసానికి మీ పాలనలో నిర్మించి మీ పాలనలోనే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమన్నారు. మీ కవితమ్మ ఢిల్లీ వేదికగా చేసిన లిక్కర్ స్కామ్ తో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల విధ్వంసం జరిగిందన్నారు.

పరధ్యానం..ఆలోచన రహితం కూడా కేసీఆర్ పాలనలో జరిగిందని, పదేళ్ల పాటు సెక్రటేరియట్ లోనూ, ప్రగతి భవన్ లోనూ కూడా ప్రజలను కలువకుండా ఫాంహౌసులోనే కేసీఆర్ పరధ్యానంలోనే ఉండిపోయారన్నారు. అటువంటి మీ కేసీఆర్ పాలనను ఏమంటారని, మీకు వర్తించే త్రీడీ మరెవరికి వర్తించదని, ముఖ్యంగా కేటీఆర్ కు 2024నిజంగానే కష్టకాలమైందని చురకలేశారు. బావకు పార్టీ అధికారం చిక్కుతుందేమోనని, అయ్య అధికారం ఇవ్వకపాయే..చెల్లి జైలు నుంచి వచ్చి చెలగాట మాడుతదేమో అని రోజు భయభ్రాంతులతో 2024అంతా గడిపావని .. పనికిరాని ట్వీట్లతో కాలక్షేపం చేస్తున్నావని కేటీఆర్ పై వంగ్యాస్త్రాలు వేశారు. కనీసం 2025లోనైనా కేటీఆర్ కు జ్ఞానోదయం కలగాలని ఆ భగవంతుని వేడుకుంటున్నానంటూ ఎంపీ చామల పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed