- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chamala Kiran: బెయిల్ వస్తుందని తెలిసే ఢిల్లీ వెళ్ళారా?.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలు సిగ్గుపడేలా కవిత ఢిల్లీలో లిక్కర్ స్కాం చేస్తే.. కడిగిన ముత్యం ఎలా అవుతుందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఐదు నెలల క్రితం అరెస్ట్ అయిన కవిత మంగళవారం బెయిల్ పై విడుదల అయ్యారు. దీనిపై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిందని, కేసు అయిపోయినట్టుగా లిక్కర్ స్కామ్ నుంచి బయటపడినట్టుగా బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. బెయిల్ వచ్చిన అంత మాత్రాన ఆమె కడిగిన ముత్యం కాదని, తెలంగాణ ప్రజలు సిగ్గుపడే విధంగా ఢిల్లీలో లిక్కర్ స్కాం చేసిందని విమర్శించారు. కవిత బెయిల్ రావడానికి ముందు రోజే బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఢిల్లీ చేరుకుని, బీజేపీతో మంతనాలు జరిపి, బెయిల్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
అలాగే కేటీఆర్ పదే పదే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారని మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లింది రాష్ట్ర వ్యవహారాలు చక్క దిద్దడానికి, విభజన హామీలు పెండింగ్ విషయాలు రావలసిన నిధుల కోసం వెళ్లారని, కానీ మీరు కేవలం కవిత బెయిల్ కోసం చాలా సార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకులతో మంతనాలు జరిపినట్లు మీ కదలికలను తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకున్నారని అన్నారు. ఇక కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మనుసింఘ్వీని తప్పు పట్టడం సరైనది కాదని, దేశంలో ప్రముఖ న్యాయవాదిగా మాత్రమే ఆయనను బీఆర్ఎస్ నాయకులు నియమించుకున్నారని తెలిపారు. అది కూడా తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక అవ్వకముందే జరిగిందని తెలిపారు. అలా అయితే మీ బిజెపి ఎంపీ రఘునందన్ రావు గతంలో ఎంఐఎం సోదరుల కేసు వాదించారని, మరి మీరు కూడా ఎంఐఎంతో అంట కాగినట్టు అనుకోవాలా? అని చామల కిరణ్ అన్నారు.