- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Chamala Kiran: ఫామ్‌హౌజ్ పాలనకు మాకు పొంతనా?.. ఎంపీ చామల హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, బీజేపీ వాళ్లు సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారని, ఫామ్ హౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన పై గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని చెరువులు కుంటలు కబ్జాకు గురైతే.. వాటి మీద హైడ్రా తీసుకుంటున్న యాక్షన్ ను యాక్టర్లు కేటీఆర్, హారీష్ రావు, అప్పుడప్పుడు బీజేపీ నాయకులు తప్పు బట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో 28 లక్షల మంది రైతులకు రుణమాఫీ అయితే వారెవ్వరు కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపలేదు. కానీ సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాకపోతే బీఆర్ఎస్ వాళ్లు వారిని వెతికి పట్టుకొని తమ సోషల్ మీడియాలో అసలు రుణమాఫీనే జరగలేదని అబద్దాలు చెప్పిస్తున్నారని మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యేలను రైతులు చెట్లకు కట్టేసి కొట్టాలి
ఇక హైడ్రా విషయానికి వస్తే.. కేసీఆర్ గతంలో హైద్రాబాద్ లో 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని మీడియాతో చెప్పాడని, పదేళ్లలో వాటిని కూలగొట్టకుండా చోద్యం చూసిన కేటీఆర్, హరీష్ రావులు ఇప్పుడు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని విష ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో మూసీ నది కింద వేల ఎకరాలు పంటలు పండుతాయని, కానీ వాటిని కొనే పరిస్థితి లేదని తెలిపారు. మూసీ లోని వ్యర్థాల వల్ల అక్కడ పండిన పంటలు, అక్కడ పెంచిన చేపలు ఎవరు కొనరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పర్యటనలు చేస్తే చెట్లకు కట్టేసి కొట్టాలని మూసీ ప్రాంత రైతులకు సూచిస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన కోసం వాజ్‌పేయ్ నిధులు కేటాయించారని, ఇప్పుడు బీజేపీ వాళ్లు సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారని అన్నారు. గత పదేళ్లు బీఆర్ఎస్ మూసీ ప్రక్షాళన అని మేనిఫెస్టోలో పెట్టి, దాని కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేసి, నిధులు కేటాయించి చిన్న పని కూడా చేయకుండా ఇప్పుడు కేటీఆర్, హరీష్ లు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఫామ్‌హౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతనా?
రియల్ ఎస్టేట్ పడిపోయిందని మాట్లాడుతున్నారు. కానీ, తప్పుడు ప్రచారాలతో రియల్ ఎస్టేట్ ను పడేస్తున్నది బీఆర్ఎస్ నాయకులేనని విమర్శలు చేశారు. మూసీ నది ప్రక్షాళనకు డీపీఆర్ లు కాలేదని అంటున్నారని, పదేండ్లలో ఏం పీకలేనిది పది నెలల్లోనే కావాలంటే ఎలా జరుగుతుందని మండిపడ్డారు. ఫాంహౌజ్ లో పడుకొని పాలన చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి, 24 గంటలు పని చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలిక ఎక్కడుందని ప్రశ్నించారు. బుల్డోజర్లకు అడ్డం పడుకుంటామని తల్లీ కొడుకులు మాట్లాడుతున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేయోద్దని చెప్పారు. ఎవరో ఒక రాజకీయ నాయకులు కబ్జాలు పెట్టడం వల్లనే ఇవాళ మధ్యతరగతి ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. ప్రజలు ఎవరు ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, బాధితులు అందరినీ ఆదుకునేందుకు కార్పోరేషన్ చైర్మన్ లను కూడా సమాయత్తం చేస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు పదేళ్లలో ఏం చేయలేక పది నెలల్లో ఏదో చేస్తా అంటున్నా రేవంత్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలు చేస్తూ హైడ్రాను, మూసీ ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ఒక్కటే చెప్పదలుచుకున్నానని, ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండాలని, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయోద్దని సూచించారు.