తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా చాకలి ఐలమ్మ మనవరాలు..!

by Mahesh |   ( Updated:2024-09-10 16:12:37.0  )
తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా చాకలి ఐలమ్మ మనవరాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి సందర్భంగా మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అలేఖ్య పుంజాల బృందం చాకలి ఐలమ్మ నృత్య రూపకం ప్రదర్శించి నివాళులు అర్పించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు పోరాట నారీమణి చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని కొనియాడారు. అలాగే కోఠి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed