- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నవీన్ మిట్టల్ కు రూ.6 కోట్ల ముడుపులందాయి.. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ పై.. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఆయనకు రూ.6 కోట్ల ముడుపులు అందాయని ఆరోపణలు చేశారు. గ్లోబరినా సంస్థకు ఈ టెండర్లను అంటగట్టేందుకే ఈ మొత్తం అందిందని వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో గ్లోబరినా సంస్థ కారణంగా 10 లక్షల మంది విద్యార్థులు ఆగమయ్యారని, 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టారన్నారు. అయినా పేరు మార్చుకుని ఈసారి జవాబు పత్రాల మూల్యంకనం టెండర్లు కూడా తీసుకోవాలని చూస్తోందన్నారు. గ్లోబరినా సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు నవీన్ మిట్టల్ కు రూ.3 కోట్లు ముట్టాయని మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇది కోట్ల ముడుపుల డీల్ అని ఆయన పేర్కొన్నారు. ప్రీ బిడ్డింగ్ మీటింగ్ కు 'సీవోఈఎంపీటీ' అనే సంస్థ వచ్చిందో లేదా అని నవీన్ మిట్టల్ జవాబు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 'గ్లోబరినా' సంస్థకు 'సీవోఈఎంపీటీ' సంస్థకు సీఈవో వీఎస్ఎన్ రాజు ఒక్కరేనని ఆయన తెలిపారు. బిడ్ వేసేందుకు ఈనెల 9 వరకు గడువు ఉందన్నారు.
'సీవోఈఎంపీటీ' అనే కంపెనీ బిడ్ వేసిందా లేదా అనే విషయాన్ని బయటపెట్టాలని మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. రూ.ఆరు కోట్ల ముడుపుల కోసం నవీన్ మిట్టల్ గ్లోబరినా సంస్థకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్లోబరీనాకు, 'సీవోఈఎంపీటీ' సంస్థ కు సంబంధం లేదని ప్రూవ్ చేయాలని మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను నవీన్ మిట్టల్ పై చేసిన ఆరోపణలు తప్పని భావిస్తే ఇంటర్ బోర్డు కమిషనర్ కార్యాలయంలోని అమ్మవారి ఆలయం వద్ద ఆయన ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు. ఈ విషయంలో తాను ప్రమాణం చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంచేశారు. ఓ ఐఏఎస్ అధికారి హోదాలో ఉన్న నవీన్ మిట్టల్ తన తల్లిపై అసభ్యకరంగా దూషించడాన్ని ఖండించారు. నవీన్ మిట్టల్ బెదిరింపులకు తాను భయపడే వ్యక్తిని కాదని, ప్రాణం పోయినా వెనకడుగు వేసేది లేదని ఆయన స్పష్టంచేశారు. ఇంటర్ బోర్డులో జరుగుతున్న వ్యవవహరంపై ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపించాలని, నవీన్ మిట్టల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.