- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌కు చాడ వెంకటరెడ్డి బహిరంగ లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: శ్రీరాంసాగర్ వరద కాలువ గౌరవెళ్ళి రిజర్వాయర్ క్రింద ముంపుకు గురవుతున్న భూ నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న భూ నష్టపరిహారం, పునరావాస ప్యాకేజి అందించి 84 మందికి ప్యాకేజీ మంజూరు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. 2014సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవెల్లి, గండిపల్లి కెనాల్స్ పనులు వేగవంతంగా కొనసాగాయని, అనివార్యంగా తోటపల్లి రిజర్వాయర్ రద్దు చేయబడిందన్నారు.
ఆ సమయంలో రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వం డబ్బులు చెల్లించకున్నా ప్రాజెక్టు కోసం భూములను స్వచ్చందంగా ఇచ్చారని తెలిపారు. గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని రెండవసారి పెంచినందువలన అక్కడ కూడా దాదాపు 80 శాతం పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. గుడాటిపల్లి, తెనుగుపల్లి, ఇతర తండాలు ముంపుకు గురవుతున్నందున పునరావాస ప్యాకేజి క్రింద 91 మంది రైతులకు 125 ఎకరాలకు నేటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు.
అదే విధంగా మేజరైన 84 మంది పెళ్లి కాని యువతులకు లిస్టులో పేర్లున్నప్పటికీ పునరావాస ప్యాకేజీ ఇవ్వబడలేదన్నారు. దీని వలన నిర్వాసితులు, యువతులు తీవ్రమైన ఇబ్బందులకు గురౌతున్నారని, అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే హామీ మేరకు 1804 మంది రైతులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామన్న హామీ నేటి వరకు అమలు కాలేదన్నారు. గ్రామాలు ఖాళీ చేయలేక వేరే ప్రదేశానికి వెళ్లడానికి పూర్తిస్థాయిలో డబ్బులు రానందున దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వివరించారు.
ఇప్పుడేమో ప్రభుత్వం సీరియస్‌గా నిర్ణయం తీసుకొని రిజర్వాయర్ గండిని మూసివేస్తున్నదని, దీంతో భూ, కోళ్ళ ఫారాలకు నష్టపరిహారం రాని రైతులు, అలాగే లిస్టులో పేర్లు నమోదు కాబడినప్పటికీ పునరావాస ప్యాకేజీ అందించబడలేదన్నారు. శ్రీరాంసాగర్ వరద కాలువలో భాగంగా గౌరవెల్లి రిజర్వాయర్‌లో వచ్చే వర్షాకాలము వరకు నీళ్ళు నిల్వ చేయాలని సంకల్పం మంచిదేనని, అయితే మిగిలి పోయిన భూ, కోళ్ళ ఫారాలకు నష్టపరిహారం కేవలం 84 మంది ఎస్సీ, బీసీ యువతులకు పునరావాస ప్యాకేజీ మానవతా దృక్పథంతో ఇప్పించాలని లేఖలో పేర్కొన్నారు.