- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరద సహాయం
దిశ, వెబ్ డెస్క్ : భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. వరద బాధితుల తక్షణ సహాయక చర్యల కింద తెలంగాణ(Telangana), ఏపీ(AP) రాష్ట్రాలకు భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.3300 కోట్ల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith sha) వెల్లడించారు. భారీ వర్షాలు, వరదల వలన తీవ్రంగా నష్టపోయిన ఏపీలోని విజయవాడ, తెలంగాణ లోని ఖమ్మం ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గత రెండు రోజులుగా పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేశారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu )కు ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) స్వయంగా ఫోన్ చేసి.. రెండు రాష్ట్రాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తక్షణ సహాయక చర్యల నిమిత్తం ఈ మొత్తాన్ని ప్రకటించినట్టు తెలుస్తోంది.
- Tags
- Flood Relief