సూర్యచంద్రులు ఉన్నంత వరకు అల్లూరి చరిత్ర విస్మరించలేరు: G. Kishan Reddy

by GSrikanth |   ( Updated:2023-07-04 13:07:24.0  )
సూర్యచంద్రులు ఉన్నంత వరకు అల్లూరి చరిత్ర విస్మరించలేరు: G. Kishan Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: అల్లూరి వంటి మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. స్వాతంత్ర్య పోరాట యోధుడు అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి ఉత్సవాల ముగింపు వేడుకలు మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. మన్యం వీరుడు అల్లూరి పోరాటం, దేశభక్తి అసమానమైనవని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం తరహాలోనే అల్లూరి పోరాటం కూడా ప్రజల్లో ఎంతో స్ఫూర్తి రగిల్చిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనాన్ని ఆమె వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్.. అల్లురిని దైవాంస సంభూతుడిగా భావిస్తానన్నారు. 26 ఏళ్ల అతి చిన్న వయసులోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లురి సీతారామరాజు భరత జాతి గర్వించదగ్గ మహనీయుడు అని కొనియాడారు. ఎక్కడైతే పీడన, దోపిడీ ఉంటుందో అక్కడే మహానీయులు ఉద్భవించి ఉద్యమిస్తారని అన్నారు. అల్లురి ఆ కోవకు చెందిన వాడేనన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లూరి ఓ వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదని సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన చరిత్ర విస్మరించలేరని అన్నారు. మాట తప్పని మడమ తిప్పని గొప్ప మన్యం వీరుడు అల్లూరి అని అన్నారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మాట్లాడుతూ.. గిరిజనుల స్వాతంత్ర్యం, సంస్కృతిని కాపాడేందుకు అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారన్నారు.

Advertisement

Next Story

Most Viewed