మేడిగడ్డ ఘటనలో రంగంలోకి కేంద్రం

by GSrikanth |
మేడిగడ్డ ఘటనలో రంగంలోకి కేంద్రం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై తాజాగా ఆరుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కమిటీని రంగంలోకి దింపింది. జలాశయాన్ని పరిశీలించి వెంటనే నివేదిక అందించాలని ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో నిపుణుల కమిటీ హైదరాబాద్ కు బయలుదేరింది.

సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో ఈ కమిటీ సమీక్ష నిర్వహించనున్నది. సమీక్ష తర్వాత మేడిగడ్డ జలాశయాన్ని సందర్శించి నివేదికను కేంద్ర జలశక్తి శాఖకు అందించబోతున్నది. కాగా ఎన్నికల వేళ మేడిగడ్డ ఘటన అధికార బీఆర్ఎస్ కు ఛాలెంజ్ గా మారింది. ఈ అంశంలో ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరకాటంలో పెట్టేలా విమర్శలు గుప్పిస్తుండగా మరోవైపు కేంద్రం రంగంలోకి దిగడం ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed