- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mamnoor Airport: వరంగల్ ప్రజలకు గుడ్‌న్యూస్.. మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని వరంగల్ వాసులకు కేంద్ర ప్రభుత్వం (Central government) గుడ్‌న్యూస్ చెప్పింది. వరంగల్ (Warangal Mamnoor Airport) మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మామునూర్ ఎయిర్ పోర్ట్‌కు అనుమతిని మంజూరీ చేస్తూ తాజాగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌కు లేఖ రాశారు. మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయ సంస్థ (Airport Authority of India) అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగనున్నది.
గత పదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎన్‌వోసీ అడ్డంకిని రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, బోర్డులో పెట్టి ఎన్‌వోసీ ఇచ్చేలా చేసింది. దీంతో హెచ్ఏఐఎల్ తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ ఎన్‌వోసీ ఇచ్చారు. ఇప్పుడు ఈ 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' ఎన్‌వోసీని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఇప్పటికే మామునూరు ఎయిర్ పోర్టు భూసేకరణకు తెలంగాణ సర్కార్ రూ.205 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, మామునూరు ఎయిర్ పోర్టులో తొలి దశను డిసెంబరులోగా పూర్తి చేసి దేశీయ విమానాల రాకపోకలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కేరళ రాష్ట్రంలోని ప్రఖ్యాత కొచ్చిన్ అంతర్జాతీయ విమానశ్రయం తరహాలో మామునూరు ఎయిర్‌పోర్టు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలో అధికారులకు ఆదేశాలిచ్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నో ఏళ్ల వరంగల్ వాసుల కల నెరవేరనుంది. ఇక ఈ ఏడాది నుంచి విమానాశ్రయం ట్రాక్‌పై దేశియ విమానాలు నడిచేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేసింది.
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలో నిర్మించనున్న ఈ మామూనూరు ఎయిర్‌పోర్టు కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో సంప్రదింపులు చేసింది. తాము సూచించిన అదనపు భూమి కేటాయిస్తే ఎయిర్‌పోర్ట్ నిర్మాణ వ్యవహారాలు ప్రారంభిస్తామంటూ ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో లేఖ రాసింది. ప్రస్తుతమున్న 1.8 కి.మీ రన్‌వేని 3.9 కి.మీకి విస్తరించడానికి వీలుగా భూసేకరణ అవసరమని తెలిపింది. దీంతో బోయింగ్ 747 వంటి పెద్ద విమానాలు కూడా రావడానికి వెసులుబాటు దొరుకుతుందని పేర్కొన్నది. విమానాశ్రయ నిర్మాణానికి మొత్తం 950 ఎకరాలు కావాలని ఏఏఐ వివరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కసరత్తు చేస్తోంది. మామూనూరు ఎయిర్ పోర్ట్‌కు ప్రస్తుతం 696 ఎకరాల స్థలం ఉంది.