తెలంగాణ ఎన్నికలపై హోంశాఖ కీలక నిర్ణయం.. రంగంలోకి కేంద్ర బలగాలు

by Javid Pasha |   ( Updated:2023-10-20 12:52:40.0  )
తెలంగాణ ఎన్నికలపై హోంశాఖ కీలక నిర్ణయం.. రంగంలోకి కేంద్ర బలగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి సమస్యలు, అవకతవకలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిపేందుకు కసరత్తులు చేస్తోన్నారు. అందులో భాగంగా భారీ భద్రత ఏర్పాటు చేసేందుకు బలగాలను ఇప్పటినుంచే రంగంలోకి దించుతున్నారు. రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలతో కూడా భద్రత ఏర్పాటు చేస్తోన్నారు.

తాజాగా తెలంగాణ ఎన్నికల కోసం 20 వేల కేంద్ర బలగాలను హోంశాఖ కేటాయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. రెండు, మూడు రోజుల్లో ఈ బలగాలు తెలంగాణకు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మోహరించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు 100 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలను తెలంగాణకు పంపిస్తున్నారు. వీరందరూ ఎన్నికల వీధుల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత ఎన్నికల వేడి మరింత పెరగనుంది.

Advertisement

Next Story