తెలంగాణలో ఏపీ IAS, IPSలపై కేంద్రం కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-10 11:59:40.0  )
తెలంగాణలో ఏపీ IAS, IPSలపై కేంద్రం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో విధులు నిర్వహిస్తోన్న ఏపీ క్యాడర్ ఐఏఎస్‌(IAS ), ఐపీఎఎస్‌(IPS)ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోనే కొనసాగించాలన్న 11 మంది ఐఏఎస్‌ల విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. తనకు కావాల్సిన వాటిని సాధించుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారులను రాష్ట్రానికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఓకే చెప్పింది. ఏపీలో రిపోర్ట్ చేసే ఐఏఎస్‌ల జాబితాలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీ రొనాల్డ్ రోస్‌, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ప్రశాంతిలతో పాటు ఐపీఎస్‌లు అయిన అంజనీకుమార్, అభిలాషలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed