IND VS AUS : వివాదాస్ప రీతిలో జైశ్వాల్ అవుట్.. స్పందించిన బీసీసీఐ

by Harish |
IND VS AUS : వివాదాస్ప రీతిలో జైశ్వాల్ అవుట్.. స్పందించిన బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్ : నాలుగో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అవుటైన తీరు చర్చనీయాంశమైంది. థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమవ్వగా బీసీసీఐ స్పందించింది. జైశ్వాల్ నాటౌట్ అని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. ‘జైశ్వాల్ స్పష్టంగా నాటౌట్. టెక్నాలజీ ఏం సూచిస్తుందో థర్డ్ అంపైర్ గమనించాలి. లేదంటే ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్ వద్ద బలమైన కారణాలు ఉండాలి.’ అని మండిపడ్డాడు. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు. నాలుగో టెస్టులో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గవాస్కర్ మ్యాచ్ సమయంలో మాట్లాడుతూ.. స్నికో మీటర్‌లో స్పైక్ రాలేదన్నాడు. టెక్నాలజీ ఇచ్చే సాక్ష్యాన్ని తీసుకోకపోతే దాన్ని వాడటం ఎందుకు? అంటూ ప్రశ్నించాడు.

Advertisement

Next Story

Most Viewed