- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pushpa 2: బాహుబలి 2 కలెక్షన్లను బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్న పుష్ప 2
దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా నటించిన " పుష్ప 2 " ( pushpa 2) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. డిసెంబర్ 5న ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డ్ బ్రేక్ చేసింది. అయితే, బాలీవుడ్‌లో పుష్ప2 కి ఒక రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికే, హిందీలో రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అత్యధిక కలెక్షన్స్ సాధించింది.
తాజాగా, పుష్ప 2 సినిమా హిందీ వెర్షన్‍లో 25 రోజుల్లో రూ.770.25 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. అయితే, బాలీవుడ్ లో ఇప్పటికీ కూడా వేట కొనసాగుతూనే ఉందని రాసుకొచ్చింది.
అమీర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ మొదటి స్థానంలో ఉండగా, రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 సినిమా రెండో స్థానంలో ఉంది. ఇలాగే కలెక్షన్స్ కొనసాగితే.. త్వరలోనే బాహుబలి 2 కలెక్షన్లను ఈజీగా బ్రేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.