Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూలో పవన్ కల్యాణ్ చెప్పింది అక్షర సత్యం.. సినీ నిర్మాత ట్వీట్

by Hamsa |   ( Updated:2025-01-01 12:44:27.0  )
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూలో పవన్ కల్యాణ్ చెప్పింది అక్షర సత్యం.. సినీ నిర్మాత ట్వీట్
X

దిశ, సినిమా: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్‌పై స్పందించిన విషయం తెలిసిందే. ‘‘గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎవరి విషయంలోనైనా అలాగే చేస్తారు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్‌కు చెప్పి తీసుకెళ్లాల్సింది. చట్టం అందరికీ సమానం. అసలు అక్కడ ఏం జరిగిందో అర్జున్‌కు తెలియదు కానీ చెప్పినా వినపడలేదేమో. ఆయన తరపున రేవతి(Revathi) ఇంటికి పుష్ప టీమ్ వెళ్లినా బాగుండేది.

అప్పుడు ఇలాంటి రచ్చ అవకుండా ఉండేది. ఈ సంఘటన గురించి తెలుసుకుని బాధ పడ్డాను. ఆ నటుడిపై ప్రజల్లో వేరే భావన ఉండొచ్చు. అందుకే పొగరు, బలుపు అని చర్చించుకుంటున్నారు. ఒక్కడినే దోషిగా మార్చి దూషిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు. అయితే అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం చేసింది కరెక్ట్’’ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోను కొందరు కట్ చేసి ఆయన ఐకాన్ స్టార్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేశారని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, ఈ విషయం గురించి బేబీ నిర్మాత ఎస్‌కేఎన్(SKN) ట్వీట్ చేశారు. ‘‘జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో అందరూ అల్లు అర్జున్‌ని ఒంటరి చేసి నిందిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ గురించి సంధ్య థియేటర్ యాక్సిడెంట్ ఇష్యూ గురించి నిజమే చెప్పారు. కానీ కొందరు మాత్రం తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. పుకార్లకు విశ్రాంతి ఇవ్వాల్సిన సమయం ఇది! పూర్తి వివరణాత్మక వీడియోను ఇక్కడ చూడండి’’ అని రాసుకొచ్చారు. అలాగే పవన్ మాట్లాడిన పూర్తి క్లిప్‌ను షేర్ చేశారు.

Advertisement

Next Story