డిసెంబర్ 6న కేంద్రం అఖిలపక్ష సమావేశం

by samatah |   ( Updated:2022-11-23 14:23:21.0  )
డిసెంబర్ 6న కేంద్రం అఖిలపక్ష సమావేశం
X

దిశ,డైనమిక్ బ్యూరో: డిసెంబర్‌ 7 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతోంది. డిసెంబర్‌ 6న ఉదయం 11గం.లకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్ని పార్టీల పార్లమెంటరీ పార్టీ, ఉభయ సభల నేతలకు ప్రత్యేకంగా లేఖలు పంపించారు. ప్రభుత్వ బిజినెస్‌ వ్యవహారాలు, తీసుకురాబోయే బిల్లుల జాబితా, ఇతర అంశాలను అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల నేతలకు కేంద్ర మంత్రులు వివరించనున్నారు. అలాగే సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్ష నేతలను కేంద్రం కోరనుంది. దేశవ్యాప్తంగా రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ సమావేశాలు వాడీవేటీగా సాగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదంచనుంది. ముఖ్యంగా జీఎస్టీ, రైతుల సమస్యలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం అవుతున్నాయి.

Read More : 'కేంద్రం నిర్ణయం మార్చుకోకుంటే పార్లమెంట్‌కు కరెంట్ కట్!'

Advertisement

Next Story