- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PC GHOSH: అవి డిజైన్ లో లేని పనులే.. పీసీ ఘోష్ కమిషన్ కు వివరించిన సీడీవో ఎస్ఈ ఫజల్
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లోని అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కంటిన్యూ చేస్తున్నది. శుక్రవారం కమిషన్ ముందు నీటి పారుదల శాఖ సీడీవో ఎస్ఈ ఫజల్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ కు పలు కీలక అంశాలను వెల్లడించారు. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో సీకెంట్ ఫైల్ కు వెళ్లాలని కాళేశ్వరం సీఈ చెప్పారని అలాగే సుందిళ్ల రెండో బ్లాక్-ఏ లో అదనపు 6 వెంట్లు డిజైన్ లో లేనప్పటికీ ఆ తర్వాత మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో అదనపు వెంట్లు వెసినట్లు వివరించారు. క్రాస్ సెక్షన్స్ కాళేశ్వరం సీఈ నివేదిక మేరకు ఆమోదించినట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని పరిశీలించకుండానే వాటిని ఆమోదించినట్లు వెల్లడించారు.
రెండో రోజు విచారణకు నరేందర్ రెడ్డి:
సీడీవో విశ్రాంత ఈఎన్సీ నరేందర్ రెడ్డి రెండోరోజైన గురువారం కూడా పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. నిన్నటి విచారణకు కొనసాగింపుగా ఇవాళ 2 లేఖలను కమిషన్ కు నరేంద్ర రెడ్డి అందజేశారు. కాగా నిన్నటి విచారణలో డిజైన్ల ఖరారు విషయంలో కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఒత్తిడి చేశారని నరేందర్ రెడ్డి కమిషన్ కు వివరించిన సంగతి తెలిసిందే.