MLC కవిత అరెస్ట్‌పై CBI అధికారిక ప్రకటన

by GSrikanth |   ( Updated:2024-04-11 12:24:32.0  )
MLC కవిత అరెస్ట్‌పై CBI అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై సీబీఐ అధికారిక ప్రకటన చేసింది. ‘‘తీహార్ జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చేశాం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అరెస్ట్ చేస్తున్నట్లు జైలు అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చాం. ఐపీసీ సెక్షన్ 477, 120(B), పీసీ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేశాం. జైలు అధికారుల ద్వారా అరెస్ట్ చేసిన సమాచారం పంపించాం’’ అని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మె్ల్సీ కవిత తీహార్‌లోని 6వ నెంబర్ జైలులో ఉన్నారు. కాగా, రేపు (శుక్రవారం) కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. తీహార్ జైలులో ఏప్రిల్ 6న కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే, విచారణకు సహకరించకపోవటంతో, ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండటంతో కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మరోవైపు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించాలని కవిత ఫిక్స్ అయింది.

Advertisement

Next Story

Most Viewed