సీబీఐ విచారణను లైవ్ ప్రసారం చేయాలి: CPI Narayana

by samatah |   ( Updated:2022-12-11 07:08:33.0  )
CPI Narayana Takes his Words Back Over Megastar Chiranjeevi
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఏ మేరకు, ఏ రూపంలో ప్రమేయం ఉన్నదో నిర్ధారణ చేసుకోడానికి సీబీఐ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆమెను విచారించే ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీడియాకు అందజేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ టీమ్ విచారణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందనే రుజువు చేయడానికి లైవ్ ద్వారా ప్రసారం చేయడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. దేశంలోనే ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు లైవ్ ద్వారా విచారణ ప్రక్రియను యావత్తు ప్రపంచానికి అందజేస్తున్నప్పుడు సీబీఐ కూడా ఇలాంటి విధానం అనుసరించడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు.

Read More....

అపోలో హాస్పిటల్‌‌లో దీక్ష కొనసాగిస్తున్న YS Sharmila

Advertisement

Next Story

Most Viewed