- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్ నేతలను వెంటాడుతున్న కేసులు!
దిశ, డైనమిక్ బ్యూరో: కవిత లిక్కర్ కేసు వ్యవహారం బీఆర్ఎస్ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న విషయం తెలిసిందే. దీని నుంచి ఇంకా తేరుకోకముందే మరో బీఆర్ఎస్ కీలక నేత వివాదంలో చిక్కుకున్నారు. మాజీ ఎంపీ సంతోష్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-14 లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి కబ్జా చేశారని నవయుగ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజాగా సంతోష్ రావుపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
బీఆర్ఎస్ నేతలపై కేసులు
లిక్కర్ స్కామ్ ఆరోపణలతో బీఎస్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల మరోనేత బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అతని సోదరుడు తిరుపతి రెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై ఈ నెల 16న మాదాపూర్ పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు విచారణ పూర్తి అయితే మరిన్ని కేసులు వెంటాడుతాయని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.