సికింద్రాబాద్ ఆల్ఫా‌హోటల్‌పై కేసు.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

by Ramesh N |
సికింద్రాబాద్ ఆల్ఫా‌హోటల్‌పై కేసు.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రైవేటు హాస్టళ్ల పై వరుసగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సికింద్రాబాద్‌లో ఫేమస్ అయిన ఆల్ఫా హోటలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. చాలా కాలంగా ఫ్రిడ్జ్ లోనే నిల్వ ఉంచిన మటన్ మాంసాహార ముడి పదార్థాలను అధికారులు గుర్తించారు. ఆల్ఫా బ్రాండ్ ఐస్ క్రీమ్ బ్రెడ్ ప్యాకెట్లపై డేట్ లేకుండా కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆల్ఫా హోటల్‌పై కేసు అధికారులు నమోదు చేశారు.

మరోవైపు సందర్శిని హోటల్, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో తనిఖీలు చేశారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. రూల్స్‌కు వ్యతిరేకంగా నడుపుతున్న రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా, గతంలోనూ ఆల్ఫా హోటల్‌పై అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడి దారుణ పరిస్థితులు చూసి హోటల్‌ను సీజ్ కూడా చేశారు. ఇటీవల తిరిగి ఓపెన్ కాగా.. మరోసారి హోటల్ నిర్వాహకుల తీరు మారడం లేదని తెలుస్తోంది.

Advertisement

Next Story