పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎఫెక్ట్.. BRS కీలక నేతలపై కేసు నమోదు

by Satheesh |
పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎఫెక్ట్.. BRS కీలక నేతలపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు అయ్యింది. బాల్క సుమన్‌తో పాటు మన్నే గోవర్ధన్, దూదిమెట్ల బాలరాజు, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లపైన పోలీసులు కేసు ఫైల్ చేశారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని బీఆర్ఎస్ సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయనను రేవంత్ ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న బాల్క సుమన్‌, మన్నే గోవర్ధన్, దూదిమెట్ల బాలరాజు, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి.. బలవంతంగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

వెంటనే రంగంలో దిగిన పోలీసులు వీరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తాజాగా బాల్క సుమన్, గెల్లు, బాలరాజు, గోవర్ధన్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. పోలీసు విధులు అడ్డుకోవడం, ఇంట్లోకి అక్రమ చొరబాటుతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో వీరిని పోలీసులు వీరిని రిమాండ్‌కు తరలించనున్నారు. కాగా, బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేయడంపై గులాబీ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed