అమిత్ షాపై పాతబస్తీలో కేసు ఉపసంహరణ! బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్ ఇదే

by Ramesh N |
అమిత్ షాపై పాతబస్తీలో కేసు ఉపసంహరణ! బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా మరోసారి కాంగ్రెస్- బీజేపీ మధ్య సంబంధం ఉందని తీవ్ర ఆరోపణలతో ఇవాళ ట్వీట్ చేసింది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే కేంద్ర మంత్ర అమిత్ షా పై పాతబస్తీలో నమోదైన కేసు ఉపసంహరణ జరిగిందని పేర్కొంది. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడ్ ఉల్లంఘించాడన్న ఆరోపణతో షా పై కేసు నమోదు అయిందని తెలిపింది.

సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ తమ చీకటి పొత్తును కొనసాగిస్తూనే ఉందని విమర్శించింది. మొన్న సింగరేణి బొగ్గు గనులు వేలంకు బీజేపీకి మద్దతు, రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అరాచక పాలనను ప్రశ్నించకుండా మౌనం వహిస్తోందని, ఇప్పుడు కేసు కొట్టివేత జరిగిందని బీఆర్ఎస్ వెల్లడించింది. ఇలా కాంగ్రెస్, బీజేపీ ఒకరికొకరు సహకరించుకుంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో మళ్ళీ బయటపడ్డ కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధం అంటూ బీఆర్ఎస్ ట్వీట్ చేసింది.

Next Story

Most Viewed