పెండింగ్ నియోజకవర్గాల BRS అభ్యర్థుల ప్రకటన ఆ రోజే.. పేర్లు డిక్లేర్ చేసిన KCR..?

by Satheesh |   ( Updated:2023-08-29 06:22:14.0  )
పెండింగ్ నియోజకవర్గాల BRS అభ్యర్థుల ప్రకటన ఆ రోజే.. పేర్లు డిక్లేర్ చేసిన KCR..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫస్ట్ లిస్ట్‌లో 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నాలుగు సెగ్మెంట్లను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. అప్పటి నుంచి నర్సాపూర్, జనగాం, నాంపల్లి, గోషామహల్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. బలమైన నేతల వివరాలు సేకరించి, అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. జనగాం నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, నాంపల్లి నుంచి ఆనంద్ గౌడ్, గోషామహల్ నుంచి నందకిశోర్ వ్యాస్ పేర్లను డిక్లేర్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

అయితే రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. కాగా, నర్సాపూర్, జనగాంకు ఇంతకు ముందే అభ్యర్థులను ఖరారు చేసినా, అక్కడి రాజకీయ పరిస్థితులను బట్టి పెండింగ్‌లో పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, కాంట్రవర్సీ ఉన్న ఒకటీ, రెండు నియోజకవర్గాల్లో సైతం అభ్యర్థులను మార్చవచ్చనే ప్రచారం జరుగుతున్నది. అయితే అవి ఏ నియోజకవర్గాలనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారింది.

నేడు మల్కాజ్‌గిరిపై కేసీఆర్ నిర్ణయం..?

మంత్రి హరీశ్ రావుపై మల్కాజ్ గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వాటిని బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. పార్టీ నేతల నుంచి మైనంపల్లిపై చర్యలకు డిమాండ్ వచ్చింది. ఈ విషయంలో అధినేత కేసీఆర్ మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మైనంపల్లిపై చర్యలకే అధినేత మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఈ టికెట్ కేటాయించే అవకాశాలున్నట్లు సమాచారం.

కేటీఆర్ వచ్చిన తర్వాతే ప్రకటన..?

మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల్లో ఆయన తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో అప్పటివరకు నాలుగు నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో పెడుతున్నట్లు సమాచారం. నర్సాపూర్, జనగాం నియోజకవర్గాల అభ్యర్థులను కేటీఆరే ప్రకటించాలని ఒత్తిడి వస్తున్నదని, అందుకే మంత్రి వచ్చిన తర్వాతనే క్యాండిడేట్స్ గురించి అనౌన్స్ చేయనున్నట్లు తెలిసింది. మల్కాజ్ గిరి సెగ్మెంట్ అభ్యర్థి మార్పు ప్రకటన సైతం అప్పటివరకు పెండింగ్‌లో పెట్టే అవకాశముందని విశ్వసనీయంగా తెలిసింది.

Advertisement

Next Story