ఈ-ప్రిక్స్ ఈవెంట్‌ రద్దు.. ప్రభుత్వ తిరోగమన చర్యే : కేటీఆర్ హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-01-06 06:00:09.0  )
ఈ-ప్రిక్స్ ఈవెంట్‌ రద్దు.. ప్రభుత్వ తిరోగమన చర్యే : కేటీఆర్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగాల్సిన ఈ-ప్రిక్స్ ఈవెంట్‌ను నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఈ నిర్వహణపై స్పందించకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ఎఫ్ఐఏ ప్రకటించింది. ఈ క్రమంలో ఈ-ప్రిక్స్ ఈవెంట్‌ రద్దుపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన తిరోగమన నిర్ణయమని అన్నారు. ఇలాంటి ఈవెంట్లు మన నగరం, దేశం బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతాయని పేర్కొన్నారు. ఈవీ పెట్టుబడుల ఆకర్షణకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ఈ-ప్రిక్స్ ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామని ఎఫ్ఐఏ తెలిపింది. రేసింగ్ రద్దుకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed