- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రద్దు.. కారణమిదే..!
దిశ, తెలంగాణ బ్యూరో : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం, వ్యూహరచన కోసం అన్ని రాష్ట్రాల నేతలతో ఏఐసీసీ ఢిల్లీలో సమావేశమవుతున్నది. తెలంగాణలోని 17 పార్లమెంటు సెగ్మెంట్లకు ఇన్‌చార్జిలు, కోఆర్డినేటర్లను నియమించింది. ఏఐసీసీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేతలు వీరితో చర్చించేందుకు ఢిల్లీలో షెడ్యూలు ఖరారైంది. అందులో భాగంగా రాష్ట్ర మంత్రులు పలువురు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సైతం రెండు పార్లమెంటు స్థానాలకు ఇన్‌చార్జిగా ఉన్నందున ఆయన కూడా హాజరుకావాల్సి ఉన్నది. ఢిల్లీ టూర్‌పై ఇప్పటికే ప్రోటోకాల్ డిపార్టుమెంటు ఏర్పాట్లు చేసింది. కానీ చివరి నిమిషంలో ఆయన ఢిల్లీ టూర్ రద్దయింది.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ కార్యాలయం ఇచ్చిన సమాచారం ప్రకారం మధ్యాహ్నం 3.00 గంటలకే తెలంగాణ ఎంపీ స్థానాలపై ఇన్‌చార్జిలు, కోఆర్డినేటర్లతో మీటింగ్ ఉంటుంది. కానీ మరికొద్దిమంది సీనియర్ నేతలు మాత్రం షెడ్యూలు ఒక రోజు వాయిదా పడిందని, శుక్రవారం ఉంటుందని అంటున్నారు. పార్లమెంటు ఎన్నికలపై ఇప్పటికే హైకమాండ్‌కు స్పష్టమైన అభిప్రాయాన్ని రేవంత్‌రెడ్డి చెప్పినందున ఈ మీటింగుకు హాజరుకాలేదని సన్నిహిత వర్గాల సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థు (ఎమ్మెల్యే కోటాలో ఇద్దరు, నామినేటెడ్ కోటాలో మరో ఇద్దరు)ల విషయంలోనూ అధిష్టానంతో చర్చల తర్వాత సూత్రప్రాయ నిర్ణయం జరిగిందని పేర్కొన్నాయి.