Ration Cards: కొత్త రేషన్ కార్డు, హెల్త్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

by Prasad Jukanti |
Ration Cards: కొత్త రేషన్ కార్డు, హెల్త్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్త రేషన్ కార్డు, హెల్త్ కార్డుల జారీ నిమిత్తం అవసరమైన విధివిధానాలను ఖరారు చేయడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. శనివారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డులకు అర్హతలు, విధివిధానాలపై చర్చిస్తున్నారు. కాగా రాష్ట్రంలో చాలా కాలంగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది వీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా విధి విధానాలు రూపొందించి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇదే సమయంలో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డును వేరుగా ఇవ్వాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ రెండు కార్డు జారీ కోసం ఇటీవలే ఉత్తమ్ కుమార్ చైర్మన్ గా ముగ్గురు సభ్యుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Advertisement

Next Story

Most Viewed