317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

by Prasad Jukanti |
317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో నంబర్‌ 317పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ బుధవారం సమావేశం అయింది. ఈ భేటీకి మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్ తదితరులు ఆహజరయ్యారు. జీవో 317, జీవో 46పై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 317 జీవో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విధుల కేటాయింపుల్లో స్థానికత అనే అంశాన్నే మరిపోయిని సీనియార్టీకి పెద్దపీట వేశారంటూ ఉద్యోగులు అప్పట్లో రోడెక్కారు. తమ జిల్లాల్లో కాకుండా పరాయి జిల్లాల్లో విధులు నిర్వహించాల్సి వస్తుందంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉద్యోగుల అభ్యంతరాల దృష్ట్యా మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌గా మంత్రి దామోదర, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఉంటారు. 2021లో ఇచ్చిన జీవో 317, జీవో 46పై వివాదాలు, ఉద్యోగుల అభ్యంతరాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. కాగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు సర్కార్ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే జీవో 317 జీవోపై రంగారెడ్డి జిల్లాకు చెందిన టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ జిల్లాలో మాత్రం బదిలీలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నది అనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed