- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో మరో బై ఎలక్షన్.. వేడెక్కుతున్న రాజకీయం!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పదునైన వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని గుడి మల్కాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ ఇటీవల అకాల మరణం చెందారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ స్థానానికి ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత రాకపోయినా రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ఈ బై ఎలక్షన్ పార్టీల మధ్య ఆసక్తికర పోరుకు దారి తీయనుంది. 2020 లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది.
అంతకు ముందు నాలుగు స్థానాలకే పరిమితం అయిన కమలం పార్టీ గత ఎన్నికల్లో ఏకంగా 47 స్థానాలను కైవసం చేసుకుని బల్దియా పాలక వర్గంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరంచింది. అంతే కాదు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పుంజుకోవడానికి ఈ ఎన్నికల ఫలితాలు దోహదపడ్డాయనడంలో సందేహం లేకుండా చేసింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ఉపఎన్నిక వస్తే గెలుపు ఎవరిని వరించబోతోంది అనేది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారి తీసింది.
లింగోజిగూడ అనుభవం.. బీఆర్ఎస్ పోటీ ఉంటుందా?
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను ఢీ కొట్టే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కేసీఆర్ ప్రభుత్వానికి తామంటే తామే ప్రత్యామ్నాయం అంటూ ఇరు పార్టీలు వాదిస్తున్నాయి. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా గతంలో జరిగిన లింగోజిగూడ ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అయింది. 2020 ఎన్నికల్లో లింగోజిగూడ నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి ముందే చనిపోయారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ మరణించిన రమేష్ గౌడ్ కుమారుడు అఖిల్‌కు టికెట్ ఇచ్చింది. ఇక్కడ ఏక గ్రీవం కోసం బీజేపీ నేతలు మంత్రి కేటీఆర్ ను కలిశారు. దాంతో బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలో అభ్యర్థిని దింపలేదు.
అధికార పార్టీ బరి నుంచి తప్పుకోవడం, సానుభూతితో గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన బీజేపీకి కాంగ్రెస్ అభ్యర్థి బిగ్ షాక్ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన పోటీలో బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించాడు. దీంతో బీఆర్ఎస్ పోటీ లేని చోట కాంగ్రెస్ గెలుపు ఖాయం అన్నట్లు అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. అయితే ఈ సారి గుడి మల్కాపూర్ లో ఉప ఎన్నిక వస్తే లింగోజిగూడ మాదిరిగా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంటుందా లేక మారిన పరిణామాల నేపథ్యంలో పోటీకి అభ్యర్థిని నిలుపుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఇక్కడ ఏకగ్రీవం కాకుంటే పోటీ తప్పదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అనేక చోట్ల సర్పంచ్ లు ఇతర స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలకు ఎన్నికలు నిర్వహించని రాష్ట్ర ప్రభుత్వం అసలే ఇది ఎన్నికల సీజన్ కావడంతో గుడి మల్కాపూర్ డివిజన్ కు ఉప ఎన్నికను ఇప్పట్లో నిర్వహిస్తుందా లేదా అనేది కూడా సందేహంగా మారింది.